ప్రతి ఇంట్లో భర్తతోపాటు భార్యకూ బ్యాంకు ఖాతా ఉండేలా కేంద్రప్రభుత్వం జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఎన్.శ్రీధర్ అన్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రతి ఇంట్లో భర్తతోపాటు భార్యకూ బ్యాంకు ఖాతా ఉండేలా కేంద్రప్రభుత్వం జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఎన్.శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌బీహెచ్‌లో జన్‌ధన్ యోజన ఖాతాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద, బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. ఎలాంటి ప్రీమియం లేకుండా ఖాతాదారులకు రూ. లక్ష బీమాతో కూడిన జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్‌బీహెచ్ బ్రాంచ్‌లో 300 ఖాతాల లక్ష్యం త్వరలో పూర్తి కానున్నట్లు చెప్పారు. ఖాతాలు తెరిచిన వారికి కలెక్టర్ పాసుపుస్తకాలు అందజేశారు.