టీవీ నటి దీప్తి ఆత్మహత్య | tv artist deepti commits suicide in her apartment | Sakshi
Sakshi News home page

టీవీ నటి దీప్తి ఆత్మహత్య

Feb 14 2015 4:08 PM | Updated on Nov 6 2018 7:56 PM

టీవీ నటి దీప్తి ఆత్మహత్య - Sakshi

టీవీ నటి దీప్తి ఆత్మహత్య

బాలానగర్ ప్రాంతంలోని ఫతే నగరలో దీప్తి(30) అనే టీవీ ఆర్టిస్ట్ ఆత్మహత్యకు పాల్పడింది.

 హైదరాబాద్:  బాలానగర్ ప్రాంతంలోని ఫతే నగరలో దీప్తి(30) అనే టీవీ నటి ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన చెందిన దీప్తి ఆలియాస్ రామలక్ష్మీ ఫతేనగర్‌లోని ఓ అపార్టుమెంటులో నివాసముంటుంది.

శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరివేసుకుందని పోలీసులు తెలిపారు. ఆమె ఆత్యహత్య పాల్పడుతూ  ఐ ప్యాడ్ లో సెల్ఫీ ఫొటోలను కూడా తీసుకుంది. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీప్తి ఆడదే ఆధారం, ఆహ్వానం తదితర సీరియల్స్ లో నటించింది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి సూసైడ్ నోట్ ఇంట్లో వదలకపోవడం, ఎవరూ కూడా ఆమె గురించిన వివరాలు చెప్పలేకపోవడంతో దర్యాప్తు ఇంకా ముందుకు సాగట్లేదు.

Advertisement
 
Advertisement
Advertisement