నేడు, రేపు టీఎస్‌పీఎస్సీ పరీక్షలు | TSPSC exams | Sakshi
Sakshi News home page

నేడు, రేపు టీఎస్‌పీఎస్సీ పరీక్షలు

Published Sat, Oct 17 2015 3:24 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

TSPSC exams

అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్, ఏఈఈ పోస్టులకు..
సాక్షి, హైదరాబాద్: అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి శని, ఆదివారాల్లో (ఈ నెల 17, 18) తేదీల్లో పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 48 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు శనివారం ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుంది.

హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు శనివారం ఉదయం జనరల్ స్టడీస్, ఆదివారం ఉదయం ఆప్షనల్ పేపర్ ఉంటుంది. ఏఈఈ పోస్టులకు ఆదివారం ఉదయం జనరల్ స్టడీస్, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లాలి. పరీక్షలను పర్యవేక్షించేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement