ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ కు షాక్ | trs shocked at cec decision | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ కు షాక్

May 29 2015 4:45 PM | Updated on Aug 29 2018 6:26 PM

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ కు షాక్ - Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ కు షాక్

ఎమ్మెల్యే కోటాలో జరుగనున్నఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ కు గట్టి షాకే తగిలింది. ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని నిర్వహించాలని సీఈసీ నిర్ణయం తీసుకోవడంతో టీఆర్ఎస్ డైలామాలో పడింది.

హైదరాబాద్:ఎమ్మెల్యే కోటాలో జరుగనున్నఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని నిర్వహించాలని సీఈసీ నిర్ణయం తీసుకోవడంతో టీఆర్ఎస్ డైలామాలో పడింది. ఐదుగురు అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు టీఆర్ఎస్ సిద్ధం చేసిన నేపథ్యంలో ఓపెన్ బ్యాలెట్ ఎన్నిక విధానం చేటు తెచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను సొంత పార్టీ బలంతోనే గెలిచే అవకాశం ఉన్న టీఆర్ఎస్.. ఐదో అభ్యర్థికి మాత్రం కచ్చితంగా వేరే పార్టీల మద్దతు తీసుకోవాలి. ఆ క్రమంలోనే సీక్రెట్ బ్యాలెట్ విధానమైతే బాగుంటుందని టీఆర్ఎస్ భావించింది.

 

అయితే  సీఈసీ తాజా నిర్ణయం టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఎమ్మెల్సీలకు వేసే ఓటు బహిర్గతం కానుండటంతో  ఎమ్మెల్యేలు ఎటువంటి రిస్క్ తీసుకునే ఆస్కారం ఉండదు. ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించి ఓటేయాలనుకుంటే ఎమ్మెల్యే పదవి కోల్పోయే ప్రమాదం ఉంది. దీనిలో భాగంగానే టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతలు ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ భేటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement