టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఊరట | TRS mla's got relief | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఊరట

May 28 2015 4:43 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్, టీడీపీలను వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏడుగురు మ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది.

హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలను వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏడుగురు మ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది.  ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు  వినియోగించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున తాము ఇప్పుడు ఎటువంటి జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తెలిపింది.
 

ఇటీవల టీడీపీ, కాంగ్రెస్ ల నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.  అయితే ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ల ఓటుహక్కు చెల్లదంటూ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ నేత సంపత్ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపు చట్టం కారణంగా వారికి ఓటు హక్కు ఉండబోదని పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై గురువారం విచారించిన హైకోర్టు.. ఆ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తేల్చి చెప్పింది.

టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు వీరే..

టీడీపీ నుంచి
మంచిరెడ్డి కిషన్ రెడ్డి (రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం)
తీగల కృష్ణారెడ్డి ( రంగారెడ్డి జిల్లా మహేశ్వరం)
తలసాని శ్రీనివాస యాదవ్ (హైదరాబాద్ జిల్లా సనత్ నగర్)
చల్లా ధర్మారెడ్డి ( వరంగల్ జిల్లా పరకాల)

కాంగ్రెస్ నుంచి
విఠల్ రెడ్డి (ఆదిలాబాద్ జిల్లా ముధోల్)
కనకయ్య (ఖమ్మం జిల్లా ఇల్లెందు)
యాదయ్య (రంగారెడ్డి జిల్లా చేవెళ్ల).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement