టీఆర్‌ఎస్‌కు టీబీజీకేఎస్ అనుసంధానం | TRS is connected to TBGKS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు టీబీజీకేఎస్ అనుసంధానం

Aug 17 2015 4:04 AM | Updated on Jul 25 2018 2:52 PM

టీఆర్‌ఎస్‌కు టీబీజీకేఎస్ అనుసంధానం - Sakshi

టీఆర్‌ఎస్‌కు టీబీజీకేఎస్ అనుసంధానం

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న టీబీజీకేఎస్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అనుబంధంగా చేస్తూ యూనియన్ ప్రతినిధులు తీర్మానించారు...

- యూనియన్ పగ్గాలు సీఎం కేసీఆర్, గౌరవ అధ్యక్షురాలు కవితకే...
- టీబీజీకేఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం
రుద్రంపూర్ (ఖమ్మం):
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న టీబీజీకేఎస్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అనుబంధంగా చేస్తూ యూనియన్ ప్రతినిధులు తీర్మానించారు. యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని కేసీవోఏ క్లబ్‌లో ఆదివారం జరిగింది. సమావేశానికి సింగరేణి వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లోని 11ఏరియాల నుంచి యూనియన్ నాయకులు, ప్రతిని ధులు సుమారు వెయ్యి మంది వరకు హాజరయ్యారు. ఇందులో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.

తొలుత టీబీజీకేఎస్‌ను టీఆర్‌ఎస్‌కు అనుసంధానిస్తూ ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. అనంతరం సంఘం గౌరవాధ్యక్షురాలిగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఎంపికచేస్తూ తీర్మాణం చేయగా కీలక నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత తీసుకుంటారని, వారు తీసుకునే నిర్ణయంపైనే సంఘం నడుస్తుందని తీర్మాణించారు. ప్రస్తు త పదవుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఎవరిని ఉంచాలన్నా, తీసివేయాలన్నా అది సీఎం కేసీఆర్, గౌర వ అధ్యక్షురాలు కవిత నిర్ణయంపై ఆధారపడి ఉంటుం దని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. సింగరేణి కార్మికుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, తీర్మాణాల రికార్డులను రెండు మూడు రోజుల్లో అధిష్టానానికి పంపనున్నట్లు యూని యన్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు ఈ సందర్భంగా ప్రకటించారు.
 
సమావేశంలో ప్రధాన కార్యదర్శి మిరియాల రాజి రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్, మాజీ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, నాయకులు ఎర్నం గోవర్ధన్, కేంద్ర కార్యదర్శి ఆగయ్య, ఓ.రాజశేఖర్, వై.సారంగపా ణి, టీఆర్‌ఎస్ నాయకులు జి.వి.కె.మనోహర్, కంచర్ల చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement