మిర్చి విషయంలో సర్కారు విఫలం: లక్ష్మణ్‌ | TRS govt failure in Mirchi support price : K Laxman | Sakshi
Sakshi News home page

మిర్చి విషయంలో సర్కారు విఫలం: లక్ష్మణ్‌

May 5 2017 2:37 AM | Updated on Mar 29 2019 9:31 PM

మిర్చి విషయంలో సర్కారు విఫలం: లక్ష్మణ్‌ - Sakshi

మిర్చి విషయంలో సర్కారు విఫలం: లక్ష్మణ్‌

మిర్చి పంట అమ్మకాల విషయంలో రైతులకు కనీస ధరను ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు.

సాక్షి, హైదరాబాద్‌: మిర్చి పంట అమ్మకాల విషయంలో రైతులకు కనీస ధరను ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. రైతుల కష్టాలకు సీఎం కేసీఆర్, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావులే బాధ్యత వహించాలన్నారు. టీఆర్‌ఎస్‌కు రాజకీయ లబ్ధి తప్ప, రైతుల సంక్షేమం పట్టడం లేదని గురువారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. మిర్చి రైతులను ఆదు కునేందుకు తీసుకున్న చర్య ఒక్కటైనా చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 రాజకీయాల కు అతీతంగా అందరినీ కలుపుకొని రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాల ని సూచించారు. మార్కెట్‌లో క్వింటాల్‌ మిర్చి రూ.6 వేలకు అమ్ముడుపోతుంటే, కేంద్రం అంతకంటే తక్కువగా రూ.5వేలు ధర నిర్ణయించిందంటున్న హరీశ్‌రావు మార్కెట్‌పై అవగాహన లేకుండా అసత్యాలు మాట్లాడుతు న్నారని అన్నారు. మార్కెట్‌లో మిర్చిని క్వింటాలుకు రూ.3 వేలకు కూడా కొనే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చేస్తున్న విషయం మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు.

నేడు ఖమ్మం, వరంగల్‌లలో కలెక్టర్లకు వినతిపత్రాలు
మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం ఖమ్మం, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లకు పార్టీ జిల్లా శాఖలు వినతిపత్రాలను సమర్పిస్తాయని లక్ష్మణ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement