ఆశించిన స్థాయిలో టీఆర్ఎస్ గెలవలేదు: శంకర్ రావు | trs did not perform well upto the mark, says shankar rao | Sakshi
Sakshi News home page

ఆశించిన స్థాయిలో టీఆర్ఎస్ గెలవలేదు: శంకర్ రావు

Published Tue, Jan 13 2015 3:03 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

ఆశించిన స్థాయిలో టీఆర్ఎస్ గెలవలేదు: శంకర్ రావు

కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆశించిన స్థానాలు గెలవలేదని మాజీ మంత్రి శంకర్ రావు ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ లో ఎప్పుడూ అధికార పార్టీ అభ్యర్థులే గెలుపొందే వారన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లినవారే మళ్లీ గెలిచారన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్ తనకిచ్చి ఉంటే తప్పకుండా గెలిచేవాడినన్నారు.

ఒకవేళ అలా జరిగితే కంటోన్మెంట్ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధిస్ఠానం తనను పీసీసీ ఛీఫ్ చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో దళితుడిని సీఎం చేస్తానన్న సీఎం కేసీఆర్ ఎస్సీల సంక్షేమం గురించి ఆలోచించాలని హితవు పలికారు.

Advertisement
Advertisement
Advertisement