పెద్దపల్లి: ఆఖరి మోఖా అదిరింది...

TRS, Congress And BJP Are a Tough Compitition - Sakshi

టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ  భారీ బల ప్రదర్శన 

7 గంటలపాటు  జిల్లా కేంద్రం.. జన ప్రవాహం

పలుమార్లు స్తంభించిన ట్రాఫిక్‌  

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణం బుధవారం జన జాతర జరిగింది.  ఒక్కసారిగా జన సంద్రమైన జిల్లా కేంద్రం.. వేలాది సంఖ్యలో గులాబీ శ్రేణులు, ఖద్దరు దుస్తుల కాంగ్రెస్‌ కండువాలు.. కషాయంతో నిండిన బీజేపీ నేతలు తమ ఆఖరి మోఖా చూపించారు. కోలాటం గ్రూపు మహిళ బృందాలు, డోల్‌ దెబ్బ కళాకారులతో తమ అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల కార్యకర్తలు నినదించారు.  పట్టణంలో ఎక్కడ  చూసినా బుధవారం జన సందోహంతో కిక్కిరిసింది. ఎన్నికల ప్రచారంలో చివరి నిమిషం వరకుకూ పార్టీల అభ్యర్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పెద్దపల్లి పట్టణానికి ఉదయం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, విజయరమణారావు మద్దతు దారులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సైతం ఉదయమే  రంగంపల్లి నుంచి రాజీవ్‌రహదారి మీదుగా కమాన్‌ చౌరస్తా నుంచి అయ్యప్ప గుడివరకు  ర్యాలీగా చేరుకున్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి  స్థానిక  రైల్వేస్టేషన్‌ ఏరియా నుంచి ర్యాలీ చేపట్టారు కళాకారులు, డప్పు వాయిద్యాం డోల్‌దెబ్బ బృందాలు గులాబీ దళంతో కలిసి కమాన్‌ మీదుగా తిరిగి జెండా చౌరస్తా నుంచి బస్టాండ్‌ వరకు చేరుకున్నారు. పార్టీ  అభ్యర్థుల ప్రచార రథాలు ముందుకు  నడుస్తూండగా జనం, కళాకారుల అనుసరిస్తూ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ర్యాలీ అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి భారీగా కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాశిపేట లింగయ్య, రాష్ట్ర నాయకుడు మీస అర్జున్‌రావు. ఎస్‌. కుమార్, కొంతం శ్రీనివాస్‌రెడ్డి, కర్రె సంజీవరెడ్డి, రాంసింగ్, పుట్టమొండయ్య, పిన్నింటిరాజు తదితరులు పాల్గొన్నారు. 

ట్రాఫిక్‌ ఇబ్బందులు
పట్టణంలో మూడు  ప్రధాన పార్టీలు తమ బల ప్రదర్శనలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ సంఖ్యలో కనిపించినట్లు స్థానికుల నుంచి వినిపించింది. గులాబీ దళం ప్రత్యేకిం చి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టడంతో పలుమార్లు ఇక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది. రెండు కిలోమీటర్ల ప్రయా ణం దాదాపు రెండు గంటలపాటు కొనసాగింది. ఉద యం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులు ఇతర వాహనాల రాకపోకలకు తరచూ ఇబ్బం దులు ఎదురయ్యాయి. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం జి ల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసు అధికారులు ఇక్కడ ట్రాఫిక్‌ నియంత్రణ విధుల్లో పాల్గొన్నారు.  

ముగింపు ర్యాలీలో వెలిగిన ముఖాలు
ప్రచార ముగింపు సమయంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు చేపట్టిన ర్యాలీతో  ప్రత్యర్థులు దాసరి మనోహర్‌రెడ్డి, విజయరమణారావు, గుజ్జులరామకృష్ణారెడ్డి అనుచరులు ఉత్సహం చూపారు. వేలాదిగా తరిలివచ్చిన కార్యకర్తలతో అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ పదేపదే నినాదించారు. జిల్లా కేంద్రం ఒక్కసారిగా త్రివర్ణం జెండాలతో రెపరెపలాడింది. ముందుగా కాంగ్రెస్‌ జెండాలు, అ తర్వాత గులాబీ  జెండాలు, చివరగా కషాయం జెండాలతో ముగింపు ఉత్సహంతో కార్యకర్తలు ముందుకు సాగారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి విజయరమణారావు. బీజేపీ అభ్యర్థి  గుజ్జుల రామకృష్ణారెడ్డి అనుచరులంతా ఎవరికివారే చివరి ర్యాలీతో తమ విజయం ఖాయమైందంటూ వ్యాఖ్యనించారు. ఇక్కడి జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ ఎల్‌.రాజయ్య, మాజీ ఎమ్మెల్యే బిరు దురాజమల్లు, నల్లామనోహర్‌రెడ్డి, రేవతిరావు, ఎంపీపీ సారయ్యగౌడ్, సందవేన సునీత తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు

06-12-2018
Dec 06, 2018, 13:35 IST
సాక్షి, అశ్వారావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. మిరపరైతులు గిట్టుబాటు...
06-12-2018
Dec 06, 2018, 13:21 IST
పెద్దపల్లి ప్రజలకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్న. రైతు బిడ్డగా రైతులకు కావాల్సిన...
06-12-2018
Dec 06, 2018, 13:17 IST
ఆదిలాబాద్‌అర్బన్‌: మరో ఇరవై నాలుగు గంటల్లో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణ, ప్రతి ఒక్కరూ ఓటు...
06-12-2018
Dec 06, 2018, 13:12 IST
సాక్షిప్రతినిధి, సూర్యాపేట/కోదాడ : ‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ కుటుంబానికి సంపూర్ణ సంపద చేకూరింది. కానీ తెలంగాణ ప్రజలకు...
06-12-2018
Dec 06, 2018, 13:08 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఈనెల 7వ తేదీన పోలింగ్‌ నిర్వహించనుండగా.....
06-12-2018
Dec 06, 2018, 13:06 IST
సాక్షి, పెద్దపల్లి: ముందస్తు ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ముగిసింది. ప్రచారం పరిసమాప్తమైంది. చివరిరోజు జిల్లాలో అన్ని పార్టీలు...
06-12-2018
Dec 06, 2018, 13:06 IST
సాక్షి, ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉందని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని...
06-12-2018
Dec 06, 2018, 12:53 IST
హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్‌ రోడ్‌షోలో పాల్గొన్న కార్యకర్తలు బెజ్జంకి: చిలాపూర్‌లో ఎద్దును తీసుకెళ్తున్న రైతును ఓటు అడుగుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు సదాశివపేటలో టీఆర్‌ఎస్‌ ర్యాలీ కౌడిపల్లిలోని ఓ కూరగాయాల...
06-12-2018
Dec 06, 2018, 12:51 IST
సాక్షి, కామారెడ్డి అర్బన్‌: పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ అధికారితో సహా నలుగురు సిబ్బంది ఉంటారు.  పోలింగ్‌ బూత్‌లో సిబ్బంది ఇలా.. బూత్‌లో మొదటి...
06-12-2018
Dec 06, 2018, 12:48 IST
సాక్షి, నల్లగొండ : ‘మా నాన్న తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నాడు.. 11 రోజులు ఆమరణ దీక్ష చేశాడు.....
06-12-2018
Dec 06, 2018, 12:35 IST
సాక్షి, త్రిపురారం : టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా సాగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని నాగార్జునసాగర్‌...
06-12-2018
Dec 06, 2018, 12:26 IST
సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి...
06-12-2018
Dec 06, 2018, 12:19 IST
సాక్షి, హైదరాబాద్‌ : కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు చెందిన రూ.50లక్షల నగదును పోలీసులు సీజ్‌చేశారు. సర్వే ప్రధాన...
06-12-2018
Dec 06, 2018, 12:16 IST
సాక్షి, నల్లగొండ రూరల్‌ : ఎంతో వెనుకబడిన నల్లగొండ ప్రాంతానికి కృష్ణా తాగునీరు అందించిన ఘనత కోమటిరెడ్డిదే అని నల్లగొండ...
06-12-2018
Dec 06, 2018, 12:07 IST
సాక్షి, చండూరు : తనకు సంపాదన అసలే  వద్దు.. నియోజక వర్గం అంటే ఎంతో అభిమానమని, ప్రజాసేవకు అంకితం కావాలనే...
06-12-2018
Dec 06, 2018, 12:02 IST
సాక్షి, రామన్నపేట: వరంగల్‌ రామన్నపేటలోని జ్యోతిష్యుడు కాళేశ్వరం సుమన్‌శర్మ ఇంట్లో రూ.2.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌ జీవన్‌రెడ్డి...
06-12-2018
Dec 06, 2018, 11:57 IST
సాక్షి, చండూరు : మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్థికి ధన బలం .. తనకు జన బలం ఉందని టీఆర్‌ఎస్‌...
06-12-2018
Dec 06, 2018, 11:49 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఈనెల ఏడో తేదీన జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా...
06-12-2018
Dec 06, 2018, 11:48 IST
కోహెడ(హుస్నాబాద్‌):  కోహెడలో ఉన్న వైన్స్‌షాపుల ఎదుట బుధవారం వినియోగదారులు మద్యం కోసం భారీగా క్యూ కట్టారు. అసెంబ్లీ ఎన్నికల నింబంధనల...
06-12-2018
Dec 06, 2018, 11:47 IST
సాక్షి, జనగామ: రాజకీయ పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ ఓటర్లకు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top