దైవసాక్షిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం | TRS chief KCR sworn-in as first Chief minister of Telangana | Sakshi
Sakshi News home page

దైవసాక్షిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Jun 2 2014 8:27 AM | Updated on Aug 15 2018 9:20 PM

దైవసాక్షిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం - Sakshi

దైవసాక్షిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖరరావు) తెలుగు భాషలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.

హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ (కల్వకుంట్ల  చంద్రశేఖరరావు) తెలుగు భాషలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.  సోమవారం ఉదయం 8.15కు గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్లో కేసీఆర్తో ప్రమాణ స్వీకారం చేయించారు.  కేసీఆర్‌తో పాటు తెలంగాణ కేబినెట్‌తో కూడా ఆయన ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కేసీఆర్ కేబినెట్లో తొలిగా మహముద్ అలీ, టి.రాజయ్య ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం కేబినెట్ బృందానికి గవర్నర్ తేనీటి విందు ఇవ్వనున్నారు. అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పరేడ్ మైదానంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా జరిగే ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, తెలంగాణ పునర్నిర్మాణం తదితరాలపై తన మనోగతాన్ని వివరిస్తారు.


 

Advertisement
 
Advertisement
Advertisement