11 మంది ఐపీఎస్‌ల బదిలీ | Transferred 11 IPS | Sakshi
Sakshi News home page

11 మంది ఐపీఎస్‌ల బదిలీ

Mar 13 2015 1:37 AM | Updated on Sep 2 2017 10:43 PM

రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న 11 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న 11 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  అదనపు డీజీ స్థాయి అధికారులు 12 మంది ఉండగా... ఆ హోదాతో ఉండే పోస్టుల సంఖ్య 26గా ఉంది. దీం తో ఎనిమిది పోస్టుల హోదాల్ని కుదించి ఎక్స్ కేడర్‌లో ఐజీ, అదనపు డీజీస్థాయి అధికారుల్ని నియమించింది. అతుల్ సింగ్ బదిలీలో ఖాళీ అయిన కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, నార్త్ కోస్టల్ ఐజీ పోస్టుల్లో ఎవరినీ నియమించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement