సాంకేతికలోపంతో నిలిచిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ | Train services disrupted due to technical problem in narayanadri express | Sakshi
Sakshi News home page

సాంకేతికలోపంతో నిలిచిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్

Oct 29 2014 8:49 AM | Updated on Mar 28 2018 11:05 AM

తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది.

హైదరాబాద్ : తిరుపతి - సికింద్రాబాద్ మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా రైలు  ఘట్‌కేసర్-చర్లపల్లి వద్ద నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో నడిచే  పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డాయి.  రైల్వే సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేపట్టారు. మరోవైపు రైలు నిలిచిపోవటంతో  ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement