ఉపాధ్యాయులను మోసం చేసిన కేసీఆర్‌

TPTF Leader Baki Chandra Bhanu Comments On KCR Over CPS System - Sakshi

టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బాకి చంద్రభాను  

కొండపాక(గజ్వేల్‌) : ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పడం దారుణమని తెలంగాణ డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు బాకి చంద్రభాను పేర్కొన్నారు. మండల పరిధిలోని దుద్దెడలో శుక్రవారం మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ను అమలు చేస్తామంటూ రెండు పేజీల వ్యాసం రాసిన ప్రభుత్వం మాట తప్పడం దారుణమన్నారు. ఉపాధ్యాయుల జీవన్మరణ సమస్యగా మారిన సీపీఎస్‌ను రద్దు చేయకుండా ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు.

జూన్‌ 2న ఐఆర్‌ను, ఆగస్టు 15న పీఆర్సీనీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్‌ నమ్మించి మోసం చేశారన్నారు. మోసకార్లకు వత్తాసు పలుకుతున్న ఎమ్మెల్సీలు ఇప్పటికైనా స్వార్థ రాజకీయాన్ని వదిలి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు రవీందర్, నేతాజీ, రాధిక తదితరులు పాల్గొన్నారు.  

టీచర్‌ ఎమ్మెల్సీలదే బాధ్యత: టీటీఎఫ్‌
కొండపాక(గజ్వేల్‌) : ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య, నిర్లిప్త వైఖరి కారణంగానే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని టీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి ఆరోపించారు. మండల పరిధిలోని దుద్దెడ, అంకిరెడ్డిపల్లి, బందారం, దర్గా, వెలికట్ట, మర్పడ్గ, ఖమ్మంపల్లి, సిర్సనగండ్ల, కొండపాక గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులచే శుక్రవారం సభ్యత్వ నమోదును స్వీకరించారు.

ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి వత్తాసు పలకడంతోనే ఏకీకృత సర్వీస్‌ రూల్స్, పదోన్నతులు,స్పెషల్‌ టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఈ సమస్యలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పూర్తి బాధ్యత వహింయి రాజీనమా చేయాలని రామస్వామి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు కనకయ్య, రాములు, రవీందర్, వెంకటయ్య, లక్ష్మారెడ్డి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.  

సీపీఎస్‌ రద్దు చేయకుండా అసెంబ్లీని రద్దు చేస్తారా
హుస్నాబాద్‌: ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్‌రూల్స్‌ను రెండు పేజీల్లో రాసి అమలు చేస్తానాని ప్రగల్భాలు  పలికిన కేసీఆర్‌ ఉపాధ్యాయులకు మొండిచేయి చూపారని టీడీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ నన్నెబోయిన తిరుపతి, జిల్లా కార్యదర్శి వేముల శ్రీనివాస్‌ విమర్శించారు. శుక్రవారం పట్టణంలో మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా సీపీఎస్‌ రద్దు చేయకుండా శాసన సభను రద్దు చేయడం మోసమన్నారు.

జూన్‌ 2న ఐఆర్, ఆగష్టు 15న పీఆర్‌సీ ప్రకటిస్తామని చేప్పిన కేసీఆర్‌ మాటలకే పరిమితమయ్యారని అన్నారు. మోసకారులకు వత్తాసు పలుకుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వెంటనే రాజీనామా చేసి ఉపాధ్యాయుల పక్షాన నిలబడాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం మండలాధ్యక్షుడు కొటిచింతల రవీందర్, నాయకులు రమేశ్, అశోక్, రాధిక, శ్రీనివాస్, రవీందర్‌ తదితరులు ఉన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top