ఎన్నార్సీ వ్యతిరేక తీర్మానానికి మద్దతు: ఉత్తమ్‌

Tpcc Uttam Kumar Reddy Speaks About Citizenship Amendment Act - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌పీఆర్, ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే తీర్మానానికి కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణంగా మద్దతునిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి సరిపెట్టుకోకుండా కేరళ, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల తరహాలో తాము ఎన్‌పీఆర్, ఎన్నార్సీలను తెలంగాణలో అమలు చేయబోమని జీవోలు కూడా విడుదల చేయడం ద్వారా మోదీ–షా మతరాజకీయాలకు తెలంగాణ వ్యతిరేకమని తెలియజేయాలని కోరా రు. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) అమలుతో సమస్య లేదని, దాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ దేశంలోని పౌరుల మధ్య చిచ్చు పెట్టాలనుకునే కుట్రతోనే దేశ సమగ్రతకు ముప్పు ఉందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top