విదేశాంగ విధానంలో కేంద్రం వైఫల్యం | TPCC Chief Uttam Kumar Reddy Comments On PM Modi | Sakshi
Sakshi News home page

విదేశాంగ విధానంలో కేంద్రం వైఫల్యం

Jun 26 2020 1:34 PM | Updated on Jun 26 2020 1:54 PM

TPCC Chief Uttam Kumar Reddy Comments On PM Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియా కోసం చైనా సరిహద్దుల్లో ప్రాణాలు విడిచిన కల్నల్ సంతోష్ బాబు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 45 ఏళ్ల పాటు ఇండో-చైనా బోర్డర్ లో ఒక్క ప్రాణం కూడా పోలేదని, బీజేపీ ప్రభుత్వ హయాంలో 20 మంది మృతి చెందారన్నారు. ప్రధాని మోదీ పని తీరు ఏంటో దేశం గమనిస్తోందని పేర్కొన్నారు.

మోదీ విదేశీ పర్యటనల వల్ల దేశానికి ప్రయోజనం ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో దశాబ్దాలుగా భారత్ తో మిత్ర దేశాలుగా ఉన్న సరిహద్దు దేశాలు- శత్రు దేశాలుగా మారాయని వ్యాఖ్యానించారు. విదేశాంగ విధానంలో కేంద్రం వైఫల్యం చెందిందని విమర్శించారు. చైనా ఆర్మీ ఇండియా సరిహద్దుల్లో నుంచి వెనక్కి వెళ్ళాలని కోరారు. దేశ రక్షణ కోసం ఆర్మీ-నేవీ-త్రివిధ దళాలు చేస్తున్న కృషి పట్ల ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. (రైతుల నోట్లో మట్టికొడుతున్న ప్రభుత్వం)

28న పీవీ జయంతి వేడుకలు..
28వ తేదీన పీవీ జయంతి వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పీవీ నరసింహారావు ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తల గుండెల్లో ఉంటారని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement