నేడు కార్పొరేట్‌ విద్యాసంస్థల బంద్‌  | Today is the band of corporate educational institutions | Sakshi
Sakshi News home page

నేడు కార్పొరేట్‌ విద్యాసంస్థల బంద్‌ 

Oct 16 2017 2:20 AM | Updated on Nov 9 2018 4:36 PM

Today is the band of corporate educational institutions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ విద్యాసంస్థలైన నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) ఆరోపించింది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం కార్పొరేట్‌ విద్యాసంస్థల బంద్‌కు పిలుపు ఇస్తున్నట్లు ఏబీవీపీ సెంట్రల్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు రాఘవేందర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ రెండు విద్యాసంస్థల్లో ఇప్పటివరకు వందల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినా ఒక్క అరెస్టు కూడా జరగలేదన్నారు. ఆయా కాలేజీల హాస్టళ్లకు అనుమతులే లేవని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement