వర్ధన్నపేట టీజేఎస్‌ ప్రచారంలో తేనెటీగల దాడి | TJS Election Campaign Failed In Wardhannapet | Sakshi
Sakshi News home page

వర్ధన్నపేట టీజేఎస్‌ ప్రచారంలో తేనెటీగల దాడి

Dec 1 2018 9:11 AM | Updated on Aug 27 2019 4:45 PM

TJS Election Campaign Failed In Wardhannapet - Sakshi

తేనెటీగల దాడిలో గాయపడిన చంద్రారెడ్డిని పరామర్శిస్తున్న కొండేటి శ్రీధర్‌  

సాక్షి, వర్ధన్నపేట: మండలంలో శుక్రవారం మహాకూటమి బలపరిచిన టీజేఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ పగిడపాటి దేవయ్య ప్రచార పర్వంలో నల్లబెల్లి శివారు గుంటూరుపల్లి వద్ద భోజన సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఓ బాలుడి ముఖంపై కుట్టడంతో తీవ్ర అ స్వస్థతకు గురయ్యాడు. కాగా ఆ బాలుడిని వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ప్రచారంలో భాగంగా చెన్నారం, కాషగూడెం, నల్లబెల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించి మధ్యాహ్నం సమయంలో నల్లబెల్లి శివారు గుంటరుపల్లిలో ఓ షెడ్డులో భోజనాలు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఐనవోలు మాజీ చైర్మన్‌ చంద్రారెడ్డితో పాటు ఐదుగురు వ్యక్తులు  గాయపడ్డారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మాజీ ఎమ్మెల్యే   శ్రీధర్‌ పరమార్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement