అక్రమ రవాణకు అంబులెన్స్ను ఉపయోగించి అధికారులకు దొరికిపోయారు.
హైదరాబాద్: అక్రమ రవాణకు అంబులెన్స్ను ఉపయోగించి అధికారులకు దొరికిపోయారు. ఖమ్మం జిల్లా చింతూరు మండలంలో ఈ ఘటన జరిగింది. తులసిపాక ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం అంబులెన్స్లో అక్రమంగా కలప తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కలపను స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.