గాంధీలో ముగ్గురు స్వైన్‌ఫ్లూ బాధితులు | Three Swine flu cases filed in Gandhi Hospital | Sakshi
Sakshi News home page

గాంధీలో ముగ్గురు స్వైన్‌ఫ్లూ బాధితులు

Dec 28 2014 5:46 AM | Updated on Sep 2 2017 6:53 PM

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. కాప్రా ఈసీఐఎల్‌కు చెందిన శశికళ (26) ఈ నెల 24న తీవ్రమైన చలిజ్వరంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది.

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. కాప్రా ఈసీఐఎల్‌కు చెందిన శశికళ (26) ఈ నెల 24న తీవ్రమైన చలిజ్వరంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. నిర్ధారణ పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే మేడ్చల్‌కు చెందిన కాశి (34), మరో మహిళ గాంధీలో చికిత్స పొందు తున్నారు. స్వైన్‌ఫ్లూ మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు.
 
 పాలమూరులో మరొకరు...
 మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి చెందిన వ్యక్తి (30) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.  అతడు రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రాస్పత్రికి వచ్చి, పరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో అతడికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు తేలింది. దీంతో వైద్యులు శనివారం సాయంత్రం నుంచి ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement