breaking news
cold fever
-
చలిజ్వరంతో విద్యార్థి మృతి
మహబూబ్‌నగర్(తలకొండపల్లి) : పదో తరగతి విద్యార్థి చలిజ్వరంతో మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం సూర్యాతండాలో చోటుచేసుకుంది. వెల్దండ మండలం కేస్లీతండాకు చెందిన రవితేజ(15) తలకొండపల్లి మండలం గట్టిప్పలిపల్లి జెడ్పీహెచ్ఎస్లో పదోతరగతి చదువుతున్నాడు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం తలకొండపల్లి జెడ్పీహెచ్ఎస్లో తెలుగు పరీక్ష రాసి సూర్యాతండాలో ఉన్న అక్క ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాక చలిజ్వరంతో తనువు చాలించాడు. -
గాంధీలో ముగ్గురు స్వైన్‌ఫ్లూ బాధితులు
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. కాప్రా ఈసీఐఎల్‌కు చెందిన శశికళ (26) ఈ నెల 24న తీవ్రమైన చలిజ్వరంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. నిర్ధారణ పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే మేడ్చల్‌కు చెందిన కాశి (34), మరో మహిళ గాంధీలో చికిత్స పొందు తున్నారు. స్వైన్‌ఫ్లూ మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. పాలమూరులో మరొకరు... మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి చెందిన వ్యక్తి (30) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడు రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రాస్పత్రికి వచ్చి, పరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో అతడికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు తేలింది. దీంతో వైద్యులు శనివారం సాయంత్రం నుంచి ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స ప్రారంభించారు.