కలిచివేసిన ఘోర రోడ్డు ప్రమాదం | Three Of Family Killed In Jagtial Road Accident | Sakshi
Sakshi News home page

కలిచివేసిన ఘోర రోడ్డు ప్రమాదం

Jun 6 2018 11:01 AM | Updated on Aug 30 2018 4:17 PM

Three Of Family Killed In Jagtial Road Accident - Sakshi

సాక్షి, గొల్లపల్లి: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. గొల్లపల్లి మండలం చిల్వకుడూరు గ్రామ శివారులోని వంతెన వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదంలో గొల్లపల్లి మండలం చెందొలి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు చిప్ప రాములు, చిప్ప సందీప్, చిప్ప వినోద్‌లు మృతి చెందారు.


మృతులు జగిత్యాల నుండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే ముగ్గురూ ప్రాణాలు వదిలారు. బైకు పక్కనే మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడం అందరినీ కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలవడంతో చెందొలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement