యుద్ధ ప్రాతిపదికన చెరువుల పునరుద్ధరణ: విద్యాసాగర్‌రావు | The war on the basis of the restoration of the pond: Vidyasagar Rao | Sakshi
Sakshi News home page

యుద్ధ ప్రాతిపదికన చెరువుల పునరుద్ధరణ: విద్యాసాగర్‌రావు

Published Mon, Aug 25 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM

: యుద్ధ ప్రాతిపదికన చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు అన్నారు.

హైదరాబాద్: యుద్ధ ప్రాతిపదికన చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో ‘నీటి పారుదల - తెలంగాణ ప్రభుత్వ విధానం’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. పెద్ద పెద్ద డ్యామ్‌ల మీద దృష్టి పెట్టకుండా ఊరికొక చెరువును ప్రజల సహకారంతో బాగు చేసుకుంటే అందరికీ ఉపాధి లభిస్తుందన్నారు. 

  నీళ్లు సమృద్ధిగా ఉండి, పంటలు పండితే రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయన్నారు. చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భజలాల పెరుగుతాయని, తద్వారా రాబోయే కాలంలో ఒక పంటనైనా పట్టించుకోవచ్చని పేర్కొన్నారు.  సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ జి.రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అరిబండ ప్రసాద్‌రావు, అఖిల భారత రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, తదితరులు  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement