వేములపల్లి మండలం సల్కునూరు గ్రామ సమీపంలో ఉన్న పాలేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సల్కునూరు గ్రామస్తులు అడ్డుకున్నారు.
వేములపల్లి మండలం సల్కునూరు గ్రామ సమీపంలో ఉన్న పాలేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సల్కునూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. నిత్యం ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, రేయింబవళ్లు గ్రామంలో ట్రాక్టర్లు తిరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లు కూడా అధ్వాన్నంగా తయారవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు 10 ట్రాక్టర్లకు అనుమతి ఇస్తే దళారులు 50 ట్రాక్టర్లలో ఇసుక నింపుకుని పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడంతో కూలీలకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.