యువకుడు అనుమానాస్పద మృతి | The mysterious death of a young man | Sakshi
Sakshi News home page

యువకుడు అనుమానాస్పద మృతి

Nov 12 2015 8:15 PM | Updated on Mar 28 2018 11:11 AM

బాబాయి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెదిన సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూర్ మండలం జీవన్‌గీ గ్రామంలో గురువారం సాయంత్రం వెలుగు చూసింది.

బాబాయి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెదిన సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూర్ మండలం జీవన్‌గీ గ్రామంలో గురువారం సాయంత్రం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంజిలమ్మ కుమారుడు శేఖర్(19) ఈ నెల 9న బాబాయి ఇంటికి వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయాడు.

అప్పటి నుంచి కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతున్నారు. కాగా.. గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని కాగ్నా నది ఒడ్డున యువకుడి మృతదేహం గుర్తిచడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement