వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ను అమలు చేయబోవడం లేదని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
రాంగోపాల్‌పేట్: వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ను అమలు చేయబోవడం లేదని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం జనరల్‌బజార్‌లో సికింద్రాబాద్ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చీర శ్రీకాంత్ అలియాస్ సత్యనారాయణతో పాటు 500 మంది వ్యాపారులు, కార్మికులు, విద్యార్థులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.వందల కోట్ల విలువైన సరుకు షాపులో ఉంచుకుని కూడా వ్యాట్ చెల్లించకుండా తప్పించుకునే బడా వ్యాపారులకు అమలు చేస్తే ఎలా ఉంటుందని తాను అధికారులకు సూచించానని వివరించారు. కానీ ఇలా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారికి దీన్ని అమలు చేసే ప్రసక్తి లేదని అన్నారు. గత ప్రభుత్వం వస్త్ర వ్యాపారులపై వ్యాట్ విధిస్తే ఇందిరాపార్కు వద్ద ధర్నాతో పాటు వ్యాపారులకు సంఘీభావం ప్రకటించి ముందుకు వచ్చానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దండె విఠల్, నాగేందర్, అత్తెల్లి మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.