నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు తెలిపింది. దీంతో మజ్లిస్ మద్దతుతో కార్పొరేషన్ మేయర్ పదవి టీఆర్ఎస్ అభ్యర్థికి దక్కే అవకాశం ఏర్పడింది.
అయితే.. కార్పొరేషన్ కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళనకు దిగింది. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీఛార్జి చేశారు. ఈ పరిస్థితి మధ్యనే ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. స్థానిక ఎంపీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఓటు కూడా ఇక్కడ కీలకం కానుంది.