ఆలయ ప్రహారీ నిర్మిస్తా | Temple in Construction | Sakshi
Sakshi News home page

ఆలయ ప్రహారీ నిర్మిస్తా

Mar 27 2018 7:26 AM | Updated on Mar 27 2018 7:26 AM

 Temple  in Construction  - Sakshi

రాస్పెల్లిలో కల్యాణానికి హాజరైన భక్తులు

కాగజ్‌నగర్‌రూరల్‌(సిర్పూర్‌) : కాగజ్‌నగర్‌ మండలం భట్‌పల్లిలోని భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రహరీని నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. సోమవారం మందిరం ఆవరణలో ప్రహారీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మందిరంలో నిర్వహించిన సీతారాముల కల్యాణానికి ఆయన సతీమణి రమాదేవితో కలిసి ఆయన హాజరయ్యారు. ఇందులో మాజీ ఎంపీటీసీ పిర్సింగుల పోచయ్య, భక్తులు పాల్గొన్నారు. 
కన్నుల పండువగా కల్యాణం 
మండలంలోని భట్టుపల్లి, రాస్పెల్లి, సారసాలతో పాటు ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో సీతారాముల కల్యాణాన్ని సోమవారం నిర్వహించారు. భట్టుపల్లిలో నిర్వహించిన కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన సతీమణి రమాదేవి హాజరయ్యారు. రాస్పెల్లి ఆంజనేయస్వామి ఆలయం, సారసాలలోని సీతారామాంజనేయ దేవాలయంలో అంగరంగ వైభవంగా కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.  

Advertisement
 
Advertisement
Advertisement