8న కొత్త గవర్నర్‌ బాధ్యతల స్వీకరణ | Telangana New Governor To Take Oath On 8th September | Sakshi
Sakshi News home page

8న కొత్త గవర్నర్‌ బాధ్యతల స్వీకరణ

Sep 5 2019 3:22 AM | Updated on Sep 5 2019 8:30 AM

Telangana New Governor To Take Oath On 8th September - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర రాజన్‌ ఈ నెల 8న బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర ఎస్‌.చౌహాన్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీనియర్‌ అధికారులు పాల్గొననున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తమిళిసై రెండో గవర్నర్, తొలి మహిళా గవర్నర్‌ కాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ నియామకాన్ని ప్రకటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుత గవర్నర్‌ నరసింహన్‌ ఈ నెల 7న బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement