వెల్దుర్తి మృతులకు సామూహిక అంత్యక్రియలు

Telangana Govt Arranges Mass Funeral For Veldurthi Victims - Sakshi

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా వెల్దుర్తి రోడ్డుప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం 16 మృతదేహాలను మృతుల బంధువులకు పోలీసులు అప్పగించారు. కర్నూలు నుంచి గద్వాల జిల్లా రామాపురానికి మృతదేహలను తరలిస్తున్నారు. సామూహిక అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారంతోపాటు మృతుల పిల్లల చదువులు,డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లను అందించేలా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆర్డీవో వెల్లడించారు. ఆర్డీవో ప్రకటనతో మృతుల కుటుంబాలు ఆందోళన విరమించాయి. అయితే, ఎన్నికల కోడ్‌ అనంతరమే ఈ పరిహారం అందే అవకాశముందని తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top