'ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్లలో ఉంచాలి' | Telangana Government Orders Should Be Placed On Websites | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్లలో ఉంచాలి'

Sep 18 2019 2:06 PM | Updated on Sep 18 2019 2:14 PM

Telangana Government Orders Should Be Placed On Websites - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలందరూ చూసే విధంగా ప్రభుత్వ అధికారిక సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని పేరాల శేఖర్ అనే వ్యక్తి ఈ మేరకు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇప్పటివరకూ లక్షకుపైగా జీవోలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయగా అందులో 42,500 జీవోలను వెబ్‌సైట్లలో పొందుపరచలేదని ఆయన తన పిటిషన్‌లో తెలిపారు. ఈ క్రమంలో బుధవారం పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement