టార్గెట్‌.. మద్యం | Telangana Elections Alcohol Storage Warangal | Sakshi
Sakshi News home page

టార్గెట్‌.. మద్యం

Nov 1 2018 11:31 AM | Updated on Jul 11 2019 8:44 PM

Telangana Elections Alcohol Storage Warangal - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఎక్సైజ్‌ శాఖలో నోటి మాటల మీదనే నిబంధనలు మారిపోతున్నాయి. నిన్నా మొన్నటి వరకు ప్రతినెలా 10 శాతం చొప్పు న అదనంగా మద్యం విక్రయాలు ఉండాలని వెంటపడి మరీ మద్యం కొనుగోళ్లు చేయించిన ఎౖMð్సజ్‌ బాస్‌..  ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మనుసు మార్చుకున్నారు. లెక్కలకు మించి మద్యం అమ్ముడుపోవటంతో వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకు నుంచి రోజుకు 212 కేసుల చొప్పున సీజ్‌ చేయాలంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి నెలా లక్ష కేసుల మద్యం అమ్ముబోతోంది. ఉమ్మడి జిల్లాలో నెలకు 1.5 లక్షల కేసుల మద్యం అమ్ముడుపోతోంది. గడిచిన ఆరు నెలల కాలంలో దాదాపు 9 లక్షల కేసుల మద్యం విక్రయించారు.

గత ఏడాది ఇవే ఆరు నెలలతో పోల్చుకుంటే దాదాపు 12 శాతం అదనంగా మద్యం అమ్ముడుపోయింది. ఈ ఏడాది అమ్మకాలు గత పదేళ్లలోనే రికార్డు అని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడుపోవటానికి కారణం బెల్టు దుకాణాలను ప్రోత్సహించటమే. గుడుంబా తయారీ మానేసిన కుటుంబాలకు, నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించే క్రమంలోనే బెల్టు దుకాణాలు తెరిపించారు. వాటిపై కేసులు నమోదు చేయవద్దని ఎక్సైజ్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రం లో అధికారికంగా 265 మద్యం దుకాణాలు, 119 బార్లు ఉండగా.. వాటికి అనుబంధంగా సుమారు 16 వేల బెల్టు దుకాణాలు తెరిచారు. దీంతో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. 

నివ్వెరపోయిన ఎన్నికల కమిషన్‌
జిల్లాలో లిక్కర్‌ విక్రయాలను చూసి ఎన్నికల కమిషన్‌ నివ్వేరపోయింది. ఉమ్మడి జిల్లాలో 265 దుకాణాలు 24 గంటలు పనిచేసినా ఇంత మద్యం విక్రయించటం సాధ్యం కాదు.. ఎలా అమ్ముతున్నారని ఆరా తీయటంతో బెల్టు దుకాణాలే కారణమని తేలింది. ఎక్సైజ్‌ కమిషనర్‌ను వివరణ కూడా అడిగినట్లు సమాచారం. దీంతో ఎక్సైజ్‌ కమిషనర్‌ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చారు. ప్రతి ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో రోజుకు 150 సీసాల మద్యాన్ని ఖచ్చితంగా సీజ్‌ చేయాలనే ఆదేశాలు జారీ చేశారు. తెలం గాణలో 17 ఎక్సైజ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఈలెక్క న రోజుకు 212  కేసుల మద్యం కేసులు సీజ్‌ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎౖMð్సజ్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement