ఘనంగా మంత్రి ఈటల కుమార్తె వివాహం

Telangana CM KCR Couple Attends Etela Rajender Daughter Wedding - Sakshi

మంత్రి ఈటల కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ దంపతులు

సాక్షి, మేడ్చల్‌ :  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కుమార్తె నీత వివాహం  డాక్టర్‌ అనూప్‌తో శుక్రవారం  మేడ్చల్‌ మండలం పూడూర్‌లోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకల్లో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారితో పాటు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీలు జోగినిపల్లి సంతోష్,రంజిత్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి లు ఉన్నారు. 

అంతకుముందు రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రులు కేటీఆర్,హరీష్‌రావు, మల్లార్డెడి,తలసాని శ్రీనివాస్‌యాదవ్,నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎంఐఎం అధినేత అసదుద్దిన్‌ ఓవైసీ, సీఎస్‌ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి,ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్,బీజేపీ, ఇతర పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు,వివిధ శాఖ అధికారులు , వివిధ నియోజకవర్గాల నాయకులు పాల్గొని నూతన వదూవరులను ఆశీర్వదించారు.

చదవండి: మంత్రి ఈటల నివాసంలో పెళ్లి సందడి


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top