‘ఇది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది’ | Telangana BJP President K Laxman Talks In Paleru BJP Meeting In Mahabubnagar | Sakshi
Sakshi News home page

‘ఆ కుటుంబ సేవలోనే నాయకులు గడుపుతున్నారు’

Aug 29 2019 2:28 PM | Updated on Aug 29 2019 3:16 PM

Telangana BJP President K Laxman Talks In Paleru BJP Meeting In Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : దేశానికి నరేంద్రమోదీ నాయకత్వం అవసరం ఉంది కాబట్టే ఇతర పార్టీ నాయకులు బీజేపీలో చేరుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. గురువారం పాలేరు బీజేపీ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కల్వకుంట్ల కుటుంబ సేవలోనే నాయకులు గడుపుతున్నారని విమర్శించారు. ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్‌ బంగారు తెలంగాణను ఎలా నిర్మిస్తారని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామని విర్రవీగడం సరికాదని.. దేశంలోని 18 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందన్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేసుకోవాలన్నారు. ఎందరో అమరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కమల వికాసమే అంటూ ధీమా వ్వక్తం చేశారు. ఇప్పుడు జరిగేందంతా సినిమా విడుదలకు ముందు ట్రైలర్‌ మాత్రమేనని అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement