తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ మధుసూదనా చారి...
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ మధుసూదనా చారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానం ఇస్తున్నారు.
మరోవైపు ఎమ్మెల్సీల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ తీరుపై చర్చించాలని శాసనమండలిలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశంపై చర్చకు పట్టుబట్టింది. అయితే ఆ అంశం తన పరిశీలనలో ఉందని కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు.