
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ ముగిసిన అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సభ్యులు అడిగిన సందేహాలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా టీఎస్‌ఆర్టీసీ బలోపేతం, రుణాల వడ్డీ మాఫీ, మురుగు కాల్వల నిర్వహణకు చర్యలు, ఫాతిమా నగర్ రైల్వే బ్రిడ్జి, నాయీ బ్రహ్మణులకు క్షౌరశాలలు, కాంట్రాక్టు లెక్చరర్ల జీతాల పెంపు, దివ్యాంగుల సంక్షేమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు.