స్థానికత ఆధారంగానే విభజన జరగాలి

TEEJAC And TSPEA Leaders Demands About Division In Electricity Department - Sakshi

టీఈఈజేఏసీ, టీఎస్‌పీఈఏ నేతల డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల విభజన అంశంలో ఏపీ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న మొండి వైఖరిని వీడాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీఈఈజేఏసీ), తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌పీఈఏ)లు డిమాండ్‌ చేశాయి. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాల్సిందేనని ఆయా సంఘాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు శుక్రవారం టీఈఈజేఏసీ చైర్మన్‌ ఎన్‌.శివాజీ, టీఎస్‌పీఈఏ అధ్యక్షుడు రత్నాకర్‌రావు మింట్‌కాంపౌండ్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు.

విద్యుత్‌ ఉద్యోగుల విభజన ఏకసభ్య కమిటీ న్యాయమూర్తి ధర్మాధికారి మార్గదర్శకాలకు విరుద్ధంగా 582 మంది ఏపీ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు ప్రకటించారు. స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రిలీవ్‌ చేసిన ఉద్యోగులను ఏపీ విద్యుత్‌ సంస్థల్లో చేర్చుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top