అనర్హత వేటు వేయండి | tdp complaints against rebel MLAs to assembly speaker | Sakshi
Sakshi News home page

అనర్హత వేటు వేయండి

Nov 18 2014 2:32 AM | Updated on Aug 10 2018 8:08 PM

తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎనిమిది మంది ప్రజా ప్రతినిధులపై అనర్హత వేటు వేయాలని కోరు తూ మంగళవారం శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్‌లను కలవాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.

 ఫిరాయింపుదారులపై నేడు మండలి చైర్మన్, స్పీకర్‌లకు టీడీపీ ఫిర్యాదు
 
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎనిమిది మంది ప్రజా ప్రతినిధులపై అనర్హత వేటు వేయాలని కోరు తూ మంగళవారం శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్‌లను కలవాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక పార్టీ గుర్తుపై ప్రజాప్రతినిధిగా గెలిచి మరో పార్టీలో చేరితే ఆ సభ్యుడి సభ్యత్వం రద్దవుతుందని, ఈ మేరకు పార్టీ పరంగా ఫిర్యా దు చేస్తామని టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం మీడియాకు చెప్పారు. టీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో మెజారిటీ ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ‘ఐదేళ్ల దాకా మేమైతే దింపం. అల్లుడు(హరీశ్‌రావు) గుంజేస్తాడని భయమేమో’ అని దయాకర్‌రావు ఎద్దేవా చేశారు.
 
 నేడు ఇందిరాపార్కు వద్ద రైతులతో ధర్నా
 
 రైతుల ఆత్మహత్యలను నిలువరించలేని ప్రభు త్వ వైఖరికి నిరసనగా మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అనంతరం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement