తెలంగాణ తెలుగుదేశం శాసన సభాపక్షం సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానుంది.
హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం శాసన సభాపక్షం సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాగా ఈనెల 5వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
మరోవైపు తెలంగాణ టీడీపీ నాయకులు నిన్న సాయంత్రం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుచరించాల్సిన వ్యూహాంపై అధినేతతో చర్చించారు. ప్రజా సమస్యలతో పాటు రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర, కరెంట్ కోతలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చంద్రబాబు వారికి సూచించినట్లు సమాచారం.