మధుకర్‌ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలి | Sakshi
Sakshi News home page

మధుకర్‌ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలి

Published Fri, Apr 7 2017 3:14 AM

మధుకర్‌ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలి

సీఎంకు తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి  
సాక్షి, హైదరాబాద్‌: పెద్దపల్లి జిల్లాలోని మంథని మధుకర్‌ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. ఇది కచ్చితంగా కులదురహంకార హత్యేనని తమ పార్టీ నిజనిర్ధారణ కమిటీ నిర్ధారించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు గురువారం రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

మధుకర్‌ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. హత్య అనంతర పరిణామాలు, పోలీసుల పాత్ర, అధికారపార్టీ స్థానిక నేతల తీరును గమనిస్తే దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు చౌరస్తాలో తొలగించిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని అదే ప్రదేశంలో ప్రతిష్టించాలన్నారు.

Advertisement
Advertisement