breaking news
Madhukars death
-
మధుకర్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలి
సీఎంకు తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలోని మంథని మధుకర్ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. ఇది కచ్చితంగా కులదురహంకార హత్యేనని తమ పార్టీ నిజనిర్ధారణ కమిటీ నిర్ధారించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు గురువారం రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. మధుకర్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. హత్య అనంతర పరిణామాలు, పోలీసుల పాత్ర, అధికారపార్టీ స్థానిక నేతల తీరును గమనిస్తే దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు చౌరస్తాలో తొలగించిన అంబేడ్కర్ విగ్రహాన్ని అదే ప్రదేశంలో ప్రతిష్టించాలన్నారు. -
మధుకర్ మృతిపై హోంమంత్రి స్పందించాలి
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: మంథనిలో దళిత యువకుడు మధుకర్ అనుమానాస్పద మృతిపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. మధుకర్ మృతిపై బాధిత కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారికి న్యాయం చేయాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. మధుకర్ మృతి విషయంలో రాజకీయ నాయకులపై అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయన్నారు. దోషులకు శిక్ష పడే విధంగా సమగ్ర విచారణ జరిపించాలని రవి డిమాండ్ చేశారు.