'కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవు' | talasani says no regional differences for artists | Sakshi
Sakshi News home page

'కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవు'

Nov 7 2015 5:52 PM | Updated on Aug 20 2018 4:42 PM

'కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవు' - Sakshi

'కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవు'

కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

హైదరాబాద్: కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని సినిమా రంగంలో గల సమస్యలపై శనివారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సినిమా ప్రముఖులు సురేష్బాబు, సి. కళ్యాణ్, ఎన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రముఖ ప్రాంతాలను చలన చిత్రాల షూటింగ్ కోసం ఉపయోగించనున్నట్లు తెలిపారు.అలాగే నంది అవార్డుల పేరు మర్పు విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్మాతలు కోరారు. అలాగే సినిమా షూటింగ్లకు సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement