చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓలా, ఉబర్ క్యాబ్‌ల సంస్థల యాజమాన్యాలను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ డిమాండ్ చేసింది.
హైదరాబాద్ సిటీ: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓలా, ఉబర్ క్యాబ్‌ల సంస్థల యాజమాన్యాలను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ మాట్లాడుతూ...ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆటో డ్రైవర్లపై పోలీసుల వేధింపులు ఉండవని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆటోపర్మిట్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇ-ఛలాన్ విధానాన్ని రద్దుచేసి స్పాట్ ఛలాన్ పద్దతిని చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నిరవధిక ఆటో సమ్మె కొనసాగుతుందని తెలిపారు. కంట్రోల్ రూమ్ వద్ద ధర్నా చేపడతామని తెలిపారు. ఆటోల కంటే తక్కువ కిలోమీటర్ రేటు తీసుకుంటున్న డీజిల్‌తో నడిచే క్యాబ్‌లను నిషేధించాలని కోరారు.