వైవీ స్ఫూర్తితో రైతుల పక్షాన పోరాడాలి: సురవరం 

Suravaram Sudhakar Reddy Inaugurates YV Krishna Rao Office - Sakshi

కాచిగూడ : రైతులు పండించిన పంటకు  మెరుగైన ధరకోసం, వారి రక్షణ కోసం రైతు సంఘం పోరాడాలని సీపీఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. రైతు సంఘాల ఐక్యకార్యచరణ ఏర్పాటు చేసుకుని ముందుకు పోవడం అభినందనీయమ న్నారు. ఆదివారం హిమాయత్‌నగర్‌ అమృత ఎస్టేట్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర రైతు సంఘం వై.వి.కృష్ణారావు కార్యాలయాన్ని సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మఖ్దూంభవన్‌లో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సంఘం సీనియర్‌ నేత వై.వి.కృష్ణారావు తన జీవితాంతం కనీస ధరల కోసం పోరాడారని, కేద్రం ఏర్పాటు చేసిన కనీస ధరల కమిషన్‌కు ఆయనే చైర్మన్‌ అయ్యారని గుర్తుచేశారు. ఇప్పటికీ వామపక్షాలకు చెందిన రైతు సంఘాలే వారికోసం పనిచేస్తున్నాయన్నారు.

ప్రొఫెసర్‌ వకుళాభరణం రామకృష్ణ మాట్లాడుతూ మంచి కమ్యూనిస్టుగా ఉండడం అరుదనీ, ఇలాంటి వారిలో వై.వి.ఒకరని, ఆయన కమ్యూనిస్టు పార్టీలో ఉండటం ఆ పార్టీకే గొప్పతనం అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వై.వి.కృష్ణారావు వ్యవసాయంపైనే కాకుండా దేశ ఆర్థిక విధానాలపైనా ఎన్నో పుస్తకాలు రాశారన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top