‘సుప్రీం’ ఆదేశాల అమలుపై పార్లమెంటులో ఎంపీ ప్రస్తావన | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’ ఆదేశాల అమలుపై పార్లమెంటులో ఎంపీ ప్రస్తావన

Published Sat, Mar 14 2015 3:01 AM

‘సుప్రీం’ ఆదేశాల అమలుపై పార్లమెంటులో ఎంపీ ప్రస్తావన - Sakshi

సాక్షి, ఖమ్మం: పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో శాశ్వత ఉద్యోగాలను క్యాంపస్ సెలక్షన్లు, ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎంతవరకు అమలు చేస్తున్నారని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పార్లమెంటులోప్రశ్నించారు. పోస్టులను భర్తీ చేస్తున్నట్టయితే ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరారు. దీనికి ఆర్ధిక శాఖామంత్రి జయంత్‌సిన్హా సమాధానమిస్తూ..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరించినందు వల్ల స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సెంట్రల్ బ్యాంక్‌ను

సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందని చెప్పారు. శాశ్వత భర్తీకి వ్యతిరేకంగా ఉద్యోగాలను ఇంటర్వ్యూల ద్వారాగానీ, క్యాంపస్ సెలక్షన్స్ ద్వారాగానీ చేసినట్టయితే ఆయా తేదీల్లో సెలక్షన్ల ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులను పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోకి అనుమతించరని వివరించారు.

Advertisement
Advertisement