ప్రాదేశిక ఎన్నికల్లో మాదే విజయం | success of the provincial elections | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక ఎన్నికల్లో మాదే విజయం

Apr 7 2014 12:02 AM | Updated on Mar 28 2018 10:59 AM

ప్రాదేశిక ఎన్నికల్లో మాదే విజయం - Sakshi

ప్రాదేశిక ఎన్నికల్లో మాదే విజయం

టీఆర్‌ఎస్ ఊహించని విధంగా ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు.

పరిగి, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ ఊహించని విధంగా ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పరిగిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిగి వల్లభనగర్‌కు చెందిన యువజన సంఘాల నాయకులు యూత్ నాయకుడు పల్లెల ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో  టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం టీఆర్‌ఎస్ నాయకుడు జాఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు హర్షద్ టీఆర్‌ఎస్‌లో చేరాడు.
 
సాయంత్రం నిర్వహించిన మరో కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు నసీరొద్దీన్ మరికొందరు యువకులు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. యూత్ నాయకులు జగన్, వెంకటేష్, వీరేష్, శ్రీను, రాజోల్, రమేష్, సన్ని, కృష్ణ, ప్రతాఫ్, నవీన్, మల్లేశ్, శ్రీకాంత్, కిరణ్ తదితర వంద మందికి పైగా యువకులు చేరిన వారిలో ఉన్నారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరటంతో టీఆర్‌ఎస్ పార్టీ మరింత పటిష్టం అవుతుందన్నారు.
 
అందరం కలిసి కట్టుగా పార్టీని ప్రగతి పథంలో నడిపిద్దామని ఆయన తెలిపారు.   అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో.. ఇటు సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ సత్తాచాటుతుం దని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్, మీర్‌మహమూద్, ప్రవీణ్‌రెడ్డి, ఎర్రగడ్డపల్లి గోపాల్, బషీర్, అనూష, నయీం, హైమద్‌ఖురేషి, పాండు, అక్రం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement