
సాక్షి, ఆదిలాబాద్: బాసర రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. కదులుతున్న ట్రైన్ నుంచి ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూకేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఎన్పీటీఈఎల్ (NPTEL) పరీక్ష కోసం నిజామాబాద్ వెళ్లేందుకు బాసర ట్రిపుల్ ఐటీ నుంచి 106మంది విద్యార్థులు బయల్దేరారు. అయితే వీరిలో ముగ్గురు అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కబోయి.. పొరపాటున పర్భని పాసింజర్ ఎక్కారు. ట్రైన్ రన్నింగ్‌లో ఉండగా... అది తాము ఎక్కాల్సిన రైలు కాదని తెలిసి దూకేశారు. దీంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఓ విద్యార్థికి తలపై బలమైన గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి వరంగల్ జిల్లాకు చెందిన సాయికుమార్‌గా తెలుస్తోంది.