కాలేజి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి | student leaders hunger strike in rangareddy distirict | Sakshi
Sakshi News home page

కాలేజి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి

Jan 28 2015 3:57 PM | Updated on Sep 2 2017 8:25 PM

కాలేజి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి

కాలేజి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి

జిల్లాలోని కామారెడ్డి మండల డిగ్రీ కాలేజి ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ సమితి నాయకులు నిరాహార దీక్షకు దిగారు.

కామారెడ్డి : నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి మండల డిగ్రీ కాలేజి ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ సమితి నాయకులు నిరాహార దీక్షకు దిగారు. ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రైతులు విరాళాలు వేసుకుని 1964లో ఈ డిగ్రీ కాలేజ్ ని ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఉద్యమాల కారణంగా అప్పట్లో ఈ కాలేజి  యాజమాన్య బాధ్యతలు ప్రభుత్వపరమైనా... ఆస్తులు మాత్రం ప్రైవేటు వ్యక్త చేతుల్లోనే ఉన్నాయి.

దీనివల్ల కాలేజీకి రావాల్సిన యూజీసీ గ్రాంట్స్, నాక్ గుర్తింపు రాలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇక్కడి విద్యార్థి నాయకులు ఈ విషయం గురించి సీఎం కేసీఆర్ తో చర్చించారు. అయినా ఫలితం లేకపోవడంతో జేఏసీ కన్వీనర్ జగన్నాథం, లక్ష్మారెడ్డి, బాలరాజు గౌడ్ తదిత రులు ఆమరణ దీక్షకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement