వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కోలాటం | Strolling in the Wonder Book of Records | Sakshi
Sakshi News home page

వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కోలాటం

Feb 23 2018 12:47 AM | Updated on Feb 23 2018 12:47 AM

Strolling in the Wonder Book of Records - Sakshi

కోలాట బృందం

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): జనజానపద వృత్తి కళాకారుల సమాఖ్య కోలాట బృందానికి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఈ కోలాట బృందం 1,500 మంది మహిళలతో కరీంనగర్‌ పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో గురువారం పది నిమిషాలపాటు కోలాటం చేసింది.

దీంతో వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో బృందం పేరు నమోదైంది. కోలాట బృందానికి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ భారత ప్రతినిధి బింగి నరేందర్‌గౌడ్, జిల్లా ప్రతినిధి విజయభాస్కర్‌ సర్టిఫికెట్‌ ప్రదానం చేశారు. జిల్లాకు చెందిన జానపద కళాకారుల ప్రతినిధులు ఇస్మాయిల్, కృపాదానంల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement