కరీంనగర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పంట లకు, ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించింది.
కరీంనగర్ అగ్రికల్చర్: కరీంనగర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టిం చింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పంట లకు, ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించింది. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్‌యార్డులలో ఆరబోసిన ధాన్యం తడిసిపోరుుంది. జగిత్యాల మండలం చల్‌గల్ మార్కెట్ యూర్డుకు 50వేల క్వింటాళ్ల ధాన్యం అమ్మకానికి రాగా.. సుమారు 10వేల క్వింటాళ్లు తడిసిపోరుుంది. ఈదురుగాలులకు మామిడితోటల్లో కాయలు నేలరాలిపోరుు రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. కరీంనగర్‌లో విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో దాదాపు ఐదు గంటలపాటు అంధకారం నెలకొంది. గంభీరావుపేట మండలం కోళ్లమద్దిలో పిడుగుపాటుతో అగ్గతి నారాయణ(56) అనే గొర్లకాపరి మరణించాడు.
అలాగే, మల్లాపూర్ మండలం గొరెపల్లిలో పిడుగు పాటుకు బోడ సూక్యా నాయక్ మృతి చెందాడు. 32 గొర్రెలు కూడా మృతి చెందాయి. సిరిసిల్ల మండలం తంగళ్లపల్లిలో విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్‌షాక్‌తో వెంకటేశ్వర్‌రెడ్డి అనే రైతు మృతి చెందాడు.