‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూ కేటాయింపుల పాల సీ’ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూ కేటాయింపుల పాలసీగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూ కేటాయింపుల పాల సీ’ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూ కేటాయింపుల పాలసీగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలసీలోని మార్గదర్శకాల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉన్న ప్రతిచోట తెలంగాణగా మార్పు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే 2012లో జారీ అయిన ‘ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ ఉత్తర్వుల్లోనూ ఇదే మార్పులు చేసి అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.